: తాలిబాన్లతో క్రికెట్ మ్యాచ్ ఆడాలని పాక్ సర్కారు నిర్ణయం

కొన్ని కొన్ని విషయాల్లో ఏదీ అసాధ్యం కాదు! తాలిబాన్లతో క్రికెట్ మ్యాచ్ ఆడాలన్న పాకిస్తాన్ సర్కారు నిర్ణయం కూడా ఈ కోవలోకే వస్తుంది. రక్తం రుచి మరిగిన తాలిబాన్లు శాంతి మంత్రం జపిస్తారని ఊహించడం అత్యాశే అవుతుంది. అయితే, ఇటీవల ఈ మత ఛాందసులపై పాక్ సైన్యం తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. పెద్ద ఎత్తున మిలిటెంట్లను మట్టుబెట్టింది కూడా. ఈ నేపథ్యంలో పాక్ సర్కారు మరోసారి తాలిబాన్లకు స్నేహ హస్తం చాచింది. తాలిబాన్లకు అంగీకారయోగ్యమైన క్రీడ క్రికెట్ ఒక్కటే. అందుకే తమ ప్రభుత్వం వారితో క్రికెట్ మ్యాచ్ కు ఆతిథ్యమివ్వాలని భావిస్తోందని పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి చౌధరీ నిసార్ అలీ ఖాన్ తెలిపారు. క్రికెట్ తో స్పర్థ తొలగిపోతుందని, శాంతికి బీజాలు పడతాయని భావిస్తున్నామని వివరించారు. కాగా, పాక్ సర్కారు ఆఫర్ పై తాలిబాన్లు ఇంకా స్పందించలేదు.

More Telugu News