: పోస్టాఫీసులోని పొదుపు ఖాతాలకూ ఏటీఎం!

దేశంలోనే తొలిసారిగా పోస్టాఫీసులోని పొదుపు ఖాతాలకు ఏటీఎం సదుపాయాన్ని చెన్నైలో కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ఈరోజు (గురువారం) ప్రారంభించారు. పోస్టల్ శాఖను ఆధునికీకరించేందుకు 4,909 కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. మొత్తం లక్షా 55 వేల పోస్టాఫీసుల్లో ఈ ఆధునికీకరణ పనులు చేపట్టారు. ఆ నిధులతో దేశవ్యాప్తంగా పోస్టల్ ఏటీఎంలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చెన్నైలోని త్యాగరాజనగర్ ప్రధాన తపాలా కార్యాలయంలో ఏటీఎంను ఏర్పాటు చేశారు. పోస్టాఫీసులు కూడా ఇక పూర్తిస్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో ఖాతాదారులకు సేవలు అందిస్తాయని చిదంబరం తెలిపారు.

ఆయా పోస్టల్ ఏటీఎంలలో తొలి ఆరు నెలల పాటు కేవలం ఆ పోస్టాఫీసుకు సంబంధించిన పొదుపు ఖాతాదారులే అక్కడి నుంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చని, ఆ తర్వాత ఎక్కడి ఏటీఎంలోనైనా ఖాతాదారులు డబ్బులు డ్రా చేసుకోవచ్చునని చిదంబరం చెప్పారు. ఈ సంవత్సరంలో దేశవ్యాప్తంగా మొత్తం వెయ్యి ఏటీఎంలు ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే ఢిల్లీ, ముంబై నగరాల్లో కూడా పోస్టాఫీసు ఏటీఎంలు రానున్నాయి.

More Telugu News