: రాజకీయాల్లో చేరే ఆలోచన లేదు: మాధురీ దీక్షిత్
సినీ నటులలో కొందరు రాజకీయాల పట్ల ఆసక్తి చూపుతున్న ప్రస్తుత తరుణంలో కొందరు వాటికి ఆమడదూరంలో ఉండేందుకు ప్రయత్నిస్తారు. బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ కూడా ఇదే చెబుతోంది. రాజకీయాల్లో చేరాలన్న ఆలోచనే చేయట్లేదని స్పష్టం చేసింది. అయితే, ఒకవేళ తాను చేరితే తన ఆలోచనలు రహస్యంగా ఉంటాయని చెప్పింది. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటూ మిమ్మల్ని ఎవరయినా సంప్రదించారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు మాధురి పైవిధంగా సమాధానం ఇచ్చింది.