: కిరణ్ పార్టీ పెడుతున్నారు: రాయపాటి
ఆరుగురు ఎంపీలతో కలసి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కమార్ రెడ్డి పార్టీ పెడుతున్నట్లు బహిష్కృత ఎంపీ రాయపాటి సాంబశివరావు వెల్లడించారు. ఆయన పెట్టే పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, విభజనను అడ్డుకునేందుకు చాలా ప్రయత్నించామని, కానీ, కాంగ్రెస్ దౌర్జన్యంగా వ్యవహరించిందని ఆరోపించారు.