: గవర్నర్ తో భేటీ అయిన జైరాం రమేష్
హైదరాబాద్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి జైరాం రమేష్ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా? లేక రాష్ట్రపతి పాలన విధించాలా? అనే విషయంపై వీరిద్దరూ చర్చిస్తున్నట్టు సమాచారం. దీనికి తోడు, హైదరాబాద్ శాంతి భద్రతలపై కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.