: నేడు మోడీతో పాశ్వాన్ భేటీ

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీహార్ లో భారతీయ జనతా పార్టీతో ఎల్జీపీ పొత్తుకు తహతహలాడుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు నేడు ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో ఆ పార్టీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ భేటీ అవుతున్నారు. అయితే, ఇప్పటికే ఆ పార్టీ ప్రధాన నేతలతో సమావేశమై చర్చలు జరిపిన పాశ్వాన్ కొంతవరకు పొత్తును ఖరారు చేసుకున్నారు. కానీ, లోక్ సభ సీట్ల సర్దుబాటు విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. బీహార్ లో ఎల్జేపీ ఎనిమిది సీట్లు కేటాయించాలని కోరగా, కమలదళం నేతలు ఏడు సీట్లే కేటాయిస్తామంటున్నారట. దానిపై పట్టుబడుతున్న పాశ్వాన్.. మోడీతో నేటి భేటీలో సీట్ల సర్దుబాటు గురించి చర్చిస్తారా? లేక మూములుగా కలసి వెళ్లిపోతారా? అనేది తెలియాల్సి ఉంది.

More Telugu News