: అభిమాన నేతకు అపూర్వ రీతిలో స్వాగతం
4.5 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆరాధ్య నేత, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు బేగంపేట విమానాశ్రయంలో అపూర్వ రీతిలో స్వాగతం లభించింది. తొలుత భారీ సంఖ్యలో బ్రాహ్మణోత్తములు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మెదక్ చర్చికి చెందిన క్రైస్తవ మత గురువులు, ముస్లిం, సిక్కు మత పెద్దలు ఆయనకు దీవెనలు అందించారు. కేసీఆర్ రాకతో బేగంపేట విమానాశ్రయ పరిసర ప్రాంతాలు తెలంగాణ వాదులతో నిండిపోయాయి. అధిక సంఖ్యలో ఎయిర్ పోర్టుకు చేరుకున్న తెలంగాణ మహిళలు తమ అభిమాన నేతకు మంగళహారతినిచ్చి ఘన స్వాగతం పలికారు.