: రాష్ట్రపతి పాలన వద్దని చెప్పాం: కొండ్రు మురళి
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించకుండా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సోనియాను కోరామని మంత్రి కొండ్రు మురళి అన్నారు. త్వరలోనే సీమాంధ్ర ప్రాంతంలో పర్యటించాలని ఆమెను ఆహ్వానించామని చెప్పారు. సీమాంధ్ర ప్రాంతంలోని పరిశ్రమలకు కేజీ బేసిన్ లోని గ్యాస్ ను కేటాయించాలని కోరినట్టు తెలిపారు. కాసేపటి క్రితం సీమాంధ్ర మంత్రులతో సోనియాగాంధీ సమావేశం జరిగింది. భేటీ అనంతరం మంత్రి కొండ్రు మీడియాతో మాట్లాడారు.