: సీమాంధ్ర, తెలంగాణకు ఇక వేర్వేరు పీసీసీలు: దిగ్విజయ్
రాష్ట్ర విభజన జరిగి పోవడంతో సీమాంధ్ర, తెలంగాణకు రెండు పీసీసీలు, రెండు ఎన్నికల కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తెలిపారు. త్వరలో అధినేత్రి సోనియా, రాహుల్ తో ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అయితే, గత పదేళ్లలో చేసిన వాగ్దానాలను కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందని, రెండు ప్రాంతాలో అభివృద్ధికి కాంగ్రెస్ కృషి చేస్తుందని పేర్కొన్నారు. అంతేకాక సీమాంధ్రకు ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తుందని, ఇరు ప్రాంతాల్లో వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధికి ఇరు ప్రాంతాలు కృషి చేయాలని కోరారు. త్వరలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవుతుందని తెలిపారు. సోనియాతో సమావేశమైనప్పుడు పార్టీ విలీనంపై కేసీఆర్ చర్చించారని, విలీనం విషయంలో తదుపరి అంశాలపై ఇంకా చర్చించాల్సి ఉందని అన్నారు.