: ఉత్తరాఖండ్ మంత్రిపై అత్యాచారయత్నంపై కేసు

దేశ రాజధానిలో ఉత్తరాఖండ్ మంత్రి హరక్ రావత్ ఓ మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. ఆమె అవసరాన్ని తనకు అవకాశంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ కు చెందిన 30 ఏళ్ల మహిళ మంత్రిపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మహిళ తనకు ఉద్యోగం ఇప్పించాలని రావత్ ను కోరడంతో.. మాట్లాడడానికి ఢిల్లీలోని తన స్నేహితుడి నివాసానికి రావాలని ఆయన చెప్పారు. దాంతో గతేడాది సెప్టెంబర్ 9న ఆమె వెళ్లగా.. అక్కడ అత్యాచారం చేయబోయారు. ఆమె అక్కడి నుంచి తప్పించుకుని బయటపడ్డారు.

మంత్రి పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో ఇన్నాళ్లూ ఫిర్యాదు చేయడానికి ధైర్యం చేయలేకపోయినట్లు వివరించారు. దీనిపై మంత్రి స్పందన కోరగా.. ఆయన కేసు విషయం తెలియదని బదులిచ్చారు. రావత్ 25 రోజుల క్రితమే మంత్రిగా పదవీ ప్రమాణం చేశారు. లోక్ సభ ఎన్నికలకు ముందు ఈ అంశం బయటకు రావడంతో ఉత్తరాఖండ్ లో అధికార కాంగ్రెస్ కు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది.

More Telugu News