: సీఎం కిరణ్ పార్టీ ఒక్క సీటు గెలిచినా రాజకీయ సన్యాసం తీసుకుంటా: పెద్దిరెడ్డి
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పెట్టే కొత్త పార్టీ ఒక్క సీటు గెల్చినా రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాలు విసిరారు. చిత్తూరులో ఆయన మాట్లాడుతూ కిరణ్ కొత్త పార్టీ పెడితే డిపాజిట్లు కూడా రావని, పార్టీ పెట్టిన తర్వాత అవమానం జరిగితే రాష్ట్రాన్ని వదిలి ఢిల్లీకో లేక, బెంగళూరుకో వెళ్లిపోవాలని అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డివి ఉత్తర కుమార ప్రగల్భాలేనని ఆయన ఎద్దేవా చేశారు. జగన్ కు మద్దతిచ్చి కిరణ్ చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని పెద్దిరెడ్డి హితవు పలికారు.