: దుగరాజుపట్నం ఓడరేవుకు భూసేకరణ: జిల్లా కలెక్టర్
నెల్లూరు జిల్లా దుగరాజుపట్నం ఓడరేవు ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ చేస్తున్నట్లు నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ తెలిపారు. మొదటి విడతగా 170 ఎకరాల ప్రభుత్వ భూమిని విశాఖ పోర్టుకు అప్పగిస్తున్నట్లు ఆయన చెప్పారు.