: ఏపీకి రాజధానిగా జేసీ కొత్త ప్రాతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఏ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలన్న దానిపై తీవ్ర చర్చలు జరుగుతున్న క్రమంలో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కొత్త ప్రాంతాన్ని సూచించారు. గుంటూరు జిల్లాలోని మాచర్ల టౌన్ ను రాజధానిగా ప్రకటించాలని ప్రతిపాదన తీసుకొచ్చారు. హైదరాబాదు మాదిరిగా అభివృద్ధి చేసుకోవడానికి మనకు వనరులు ఉన్నాయన్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికలు వాయిదా వేయాల్సిన అవసరం లేదన్నారు. ఏ కృష్ణుడి కేబినెట్ లోనూ తనకు స్థానం వద్దని, కాంగ్రెస్ భూస్ధాపితమవుతుందని ఆరు నెలల కిందటే తాను చెప్పానన్నారు. ఎలాంటి స్వార్థం లేకుండా రాష్ట్ర ప్రజలకు సేవ చేసిన కిరణ్ కుమార్ రెడ్డి కృషి మరవరానిదని జేసీ ప్రశంసించారు.

More Telugu News