: పేపర్ టెస్ట్ ద్వారా నిమిషాల్లోనే కేన్సర్ గుర్తింపు

కొలనోస్కోపీ, మమ్మోగ్రామ్ వంటి పరీక్షలతో కేన్సర్ మహమ్మారిని గుర్తించడం కొద్దిగా సమయంతో కూడుకున్న పనే. కానీ, ఓ చిన్న పేపర్ స్టిక్ తీసుకెళ్లి యూరిన్ లో వేసి నిమిషాల్లోనే కేన్సర్ ఉందో లేదో చెప్పే అవకాశం ఉంటే? అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన భారత సంతత శాస్త్రవేత్త సంగీత్ భాటియా ఇలాంటి పరీక్షను అభివృద్ధి చేశారు. యూరిన్ లో స్టిక్ వేసి షుగర్ ఎంతుంది? గర్బం దాల్చారా? లేదా? అన్న విషయాలు తెలుసుకోవడం ప్రస్తుతం అందుబాటులో ఉన్నదే. కానీ, కేన్సర్ వంటి క్లిష్ట సమస్యను కూడా ఇంత సులభంగా గుర్తించేలా చేయడం విశేషమే. కేన్సర్ కణితి ఉన్నప్పుడు దాని నుంచి విడుదలయ్యే బయోమార్కర్లను యూరిన్ ద్వారా గుర్తించవచ్చని సంగీత్ భాటియా వివరించారు. ఈ పరీక్షా ఫలితాలు మరెన్నో వ్యాధులను చిటికెలో గుర్తించే దిశగా పరిశోధనలకు ప్రోత్సాహాన్నిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

More Telugu News