: ఆ ఒక్క వ్యక్తి దేశాన్ని నడిపిస్తాడని బీజేపీ భావిస్తోంది: రాహుల్
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ నేతల మధ్య మాటల యుద్ధాలు తీవ్రమవుతున్నాయి. తాజాగా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బీజేపీపై విమర్శలు చేశారు. ఒక్క వ్యక్తితో దేశ పాలన సాధ్యమవుతుందని బీజేపీ భావిస్తోందని మోడీని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. అధికారం ఒక్కచోటే ఉండాలని బీజేపీ అనుకుంటోందని, ప్రజలదే పాలనాధికారం అని తాము చెబుతున్నామని రాహుల్ పేర్కొన్నారు. హర్యానాలోని సోనేపట్ జిల్లాలో గన్నార్ వద్ద రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమది అవకాశాలిచ్చే ప్రభుత్వమని, ఆదేశాలు జారీ చేసే ప్రభుత్వం కాదని చెప్పుకొచ్చారు.