: అయోమయంలో హరికృష్ణ!

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు తనయుడు హరికృష్ణ తానిప్పుడు అయోమయంలో ఉన్నానని అంటున్నారు. తానసలు టీడీపీలో ఉన్నానో లేనో అర్థం కావడంలేదని అన్నారు. నేడు హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి తనను ఆహ్వానించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను మీడియా ద్వారానే తెలుసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేసినప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరం పెడుతున్నారని హరికృష్ణ ఆరోపించారు. పైగా, ఇటీవల రాజ్యసభ ఎన్నికల సందర్భంగానూ నందమూరి వారసుణ్ణి పట్టించుకోకపోవడం గమనార్హం.

More Telugu News