: ఓదార్పు ఇప్పుడు జగన్ కు కావాలి: హరీష్ రావు

తెలంగాణలో త్వరలో ఓదార్పు యాత్ర చేపట్టబోతున్న వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సెటైర్లు విసిరారు. అందరినీ ఓదార్చిన జగన్ కే ఇప్పుడు ఓదార్పు కావాలన్నారు. తెలంగాణ సీనియర్లను రోడ్డున పడేసిన జగన్ ఎవరిని ఓదార్చేందుకు వెళుతున్నారని ప్రశ్నించారు. అటు టీడీపీపైన విమర్శలు చేసిన హరీష్.. తెలంగాణలో ఉనికి చాటుకునేందుకే పసుపు జెండా పార్టీ విజయోత్సవాలు నిర్వహిస్తోందని ఆరోపించారు. ఎల్లుండి ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్న కేసీఆర్ కు ఘన స్వాగతం పలుకుతామని తెలిపారు. ఆ రోజు రెండు గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి గన్ పార్కు వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు.

More Telugu News