: 'యువ' కెప్టెన్ పై ఒక మ్యాచ్ వేటు

అండర్-19 వరల్డ్ కప్ లో యువ భారత జట్టుకు నాయకత్వం వహించిన విజయ్ జోల్ పై ఒక మ్యాచ్ నిషేధం విధించారు. నిన్న దుబాయ్ లో ఇంగ్లండ్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో జోల్ అభ్యంతరకర భాష వినియోగించాడని, అది ఐసీసీ నియమావళికి విరుద్ధమని మ్యాచ్ రిఫరీ గ్రేమీ లాబ్రోయ్ తెలిపారు. ఇంగ్లండ్ జట్టు బ్యాట్స్ మన్ బెన్ డకెట్ అవుటైన సందర్భంలో జోల్ నోరు పారేసుకున్నాడని లాబ్రోయ్ వెల్లడించారు. భారత జట్టుకే చెందిన అమీర్ ఘనీని మందలింపుతో సరిపెట్టారు. తన బౌలింగ్ లో ఎడ్ బార్నెట్ అవుటైన సందర్భంగా ఘని నోటికి పనిచెప్పాడు. ఈ రెండు ఘటనలపై ఫీల్డ్ అంపైర్లు రిఫరీకి నివేదించారు.

More Telugu News