: ఓటర్ల కోసం ప్రియాంక కిచిడీ రెడీ

ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు వినూత్న తరహాలో ముందుకెళుతున్నాయి. మొన్న న.మో చాయ్... నిన్న రా.గా మిల్క్... నేడు ప్రియాంక కిచిడీ...! ఇదీ వరస. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నియోజకవర్గమైన రాయ్ బరేలీలో తాజాగా ఆమె కుమార్తె ప్రియాంక పేరిట కిచిడీ స్టాల్ ఏర్పాటు చేశారు. ఆ స్టాల్ సందర్శించిన వారందరికీ ఉచితంగా కిచిడీ అందించారు. కాగా, వచ్చే ఎన్నికల్లో సోనియా స్థానంలో ప్రియాంక పోటీ చేస్తుందన్న వార్తలు వినవస్తున్నాయి. ఇక, ఇదే నియోజకవర్గంలోని డీడీ పురంలో కాంగ్రెస్ నేతలు చాట్ స్టాల్ ను నెలకొల్పారు. ఉచితంగా అందించే తమ చాట్ మత విద్వేష రహితమని పరోక్షంగా నరేంద్ర మోడీని దెప్పిపొడిచారు.

More Telugu News