: భారత ఫార్మా కంపెనీలను టార్గెట్ చేయడంలేదు: అమెరికా

ఇటీవల భారత్ కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీల ఔషధాలను అమెరికాలో నిషేధించడంపై అక్కడి ఫుడ్ అడ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ డీఏ) శాఖ వివరణ ఇచ్చింది. తాము భారత కంపెనీలను లక్ష్యంగా చేసుకోవడంలేదని స్పష్టం చేసింది. ర్యాన్ బాక్సీ, వోఖార్ట్ తదితర కంపెనీల ఉత్పత్తులు ప్రమాణాలకు అనుగుణంగా లేవని ఎఫ్ డీఏ కఠిన చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో భారత ఫార్మా కంపెనీలపై అమెరికా అసంబద్ధ వైఖరి అనుసరిస్తోందని కొందరు భారత అధికారులు ఆరోపించారు. ఇటీవలే భారత్ లో పర్యటించిన ఎఫ్ డీఏ కమిషనర్ మార్గరెట్ హాంబర్గ్ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ప్రజారోగ్య చట్టాలకు లోబడే తాము నిర్ణయాలు తీసుకున్నామని హాంబర్గ్ వివరించారు.

More Telugu News