: ముంబయిలోని ఆమ్ ఆద్మీ కార్యాలయంపై దాడి

ముంబయిలోని అంధేరీలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంపై ఈ మధ్యాహ్నం 2.30 గంటలకు దాడి జరిగింది. మొత్తం 20 నుంచి 25 మంది గుంపుగా వచ్చి ఈ దాడికి పాల్పడ్డారు. అయితే, ఈ దాడికి పాల్పడింది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) యేనని ఏఏపీ ట్విట్టర్ లో ఆరోపించింది. దానిపై ఏఏపీ వాలంటీర్ పరితోష్ మాట్లాడుతూ, సెకండ్ ఫ్లోర్ లో ఉన్న కార్యాలయంలోని కేజ్రీవాల్ పోస్టర్లను దుండగులు కాల్చివేసినట్లు తెలిపారు. అంతేకాక కార్యాలయం అంతా ఇంక్ బాటిల్స్ విసిరేశారని, పార్టీ బ్యానర్లు పాడయ్యాయని చెప్పారు. ఆ సమయంలో దాడి చేసిన వ్యక్తులు చెప్పలేని భాషలో తిట్టి, నినాదాలు చేసినట్లు పేర్కొన్నాడు.

More Telugu News