: ఎయిర్ ఇండియాలో మరో స్కామ్!

ఇప్పటికే పీకల్లోతు సమస్యల్లో కూరుకుపోయి, ఎల్ టీసీ స్కాంతో ఉక్కిరిబిక్కిరవుతున్న 'ఎయిర్ ఇండియా' సంస్థలో తాజాగా మరో కుంభకోణం వెలుగుచూసింది. తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగుల కుటుంబాల కోసం రూపొందించిన 'ఫ్యామిలీ ఫేర్ స్కీమ్'లో కోట్ల రూపాయల మోసం జరిగిందని ఎయిర్ ఇండియా తెలిపింది. ఈ నేపథ్యంలో వెంటనే దర్యాప్తు జరిపించాలని కోరుతూ సీబీఐకు లేఖ రాసినట్లు వెల్లడించింది. ఇప్పటికే విజిలెన్స్ డిపార్డ్ మెంట్ దీనికి సంబంధించి కొంత విచారణ చేపట్టగా.. స్కాంలో కేసు, ఇతర విషయాలపై సీబీఐకు తనవంతు సహాయం అందించనుంది. ఈ పథకం ద్వారా సంవత్సరానికి ఒకసారి తమ కుటుంబంతో సబ్సిడీ ఖర్చుతో ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది.

More Telugu News