: లోక్ సభలో కన్నడ నటి ప్రసంగం.. బల్లలు చరిచిన సభ్యులు
కన్నడ నటి రమ్య (27) లోక్ సభలో తొలిసారి ప్రసంగించారు. కర్ణాటకలోని మాండ్యా నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైన ఆమె తన వాగ్దాటితో సభికులను ఆకట్టుకున్నారు. సమావేశాలకు చివరిరోజున ఆమె చెరుకు రైతుల సమస్యలను ప్రస్తావించారు. చెరుకు ద్వారా జీవ ఇంధనమైన ఇథనాల్ ను ఉత్పత్తి చేసే విషయంలో రైతులను చైతన్యవంతులను చేయాల్సిన అవసరాన్ని రమ్య నొక్కి చెప్పారు. బ్రెజిల్ ప్రజా రవాణా వ్యవస్థలో 44 శాతం ఇథనాల్ నే ఇంధనంగా వినియోగిస్తారని సభ దృష్టికి తెచ్చారు. అంతేగాకుండా, తాను సభకు కొత్త అయినా, ఎంతో సహృదయతతో ఆహ్వానించారని ఇతర సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఆమె ప్రసంగం ముగియగానే సభ్యులందరూ బల్లలు చరుస్తూ అభినందించారు.