: తిరుపతిలో సూర్యప్రభ వాహనంపై విహరించిన కపిలేశ్వరుడు
తిరుపతి కపిల తీర్థంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు (శుక్రవారం) సూర్యప్రభ వాహనంపై కపిలేశ్వర స్వామివారు కపిల తీర్థంలో విహరించారు. రంగు రంగుల పుష్పాలంకరణతో కూడిన సూర్యప్రభపై ఆసీనులైన స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. వాహనానికి ముందు చిన్నారులు చేసిన కోలాటం, భజన భక్తులను ఆకట్టుకున్నాయి. ఇవాళ రాత్రి స్వామి వారికి చంద్ర ప్రభ వాహన సేవ జరగనుంది.