: కేసీఆర్ ఇచ్చిన మాట నిలుపుకోవాలి: డీకే అరుణ

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని రాష్ట్ర మంత్రి డీకే అరుణ తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్ర సాధనలో టీఆర్ఎస్ కూడా కీలకపాత్ర పోషించిందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే, టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానన్న కేసీఆర్ తన మాటను నిలుపుకోవాలని అరుణ కోరారు. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు అండగా నిలుస్తారని తెలిపారు. ఈ రోజు హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News