: రైల్వే ట్రాక్ పై మృత్యుధ్వని
దేశంలో రైలు పట్టాలపై అసువులుబాసిన వారి సంఖ్య 20,000. ఒక్క 2013లోనే ఇంతమంది చనిపోయారట. లోక్ సభలో అడిగిన ఓ ప్రశ్నకు రైల్వే శాఖ మంత్రి అధిర్ రంజన్ చౌధరీ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. అంతేగాకుండా, రూ.3.64 కోట్లు జరిమానాల రూపంలో రైల్వే శాఖ వసూలు చేసిందని మంత్రి తెలిపారు. దేశంలో దశలవారీగా మానవరహిత లెవల్ క్రాసింగ్ లను ఎత్తివేస్తామని చెప్పారు.