: లోక్ సభలో చేసినట్టే రాజ్యసభలో కూడా కాంగ్రెస్ చేయాలనుకుంది: కృష్ణంరాజు
లోక్ సభలో చేసినట్టే రాజ్యసభలో కూడా చేయాలని నిన్న కాంగ్రెస్ ప్రయత్నించిందని... బీజేపీ దాన్ని అడ్డుకుందని బీజేపీ నేత కృష్ణంరాజు తెలిపారు. లోక్ సభ తలుపులు మూసి, టెలికాస్ట్ ఆపేసి, సభ్యులను బయటకు పంపి బిల్లును పాస్ చేయడం అత్యంత దారుణమని చెప్పారు. ఈ వ్యవహారం ఎమర్జెన్సీని తలపించిందని అన్నారు. కాంగ్రెస్ తన దొంగ తెలివితేటలను ప్రదర్శించిందని ఆరోపించారు. ఎలక్షన్ల ముందు టీబిల్లును ఆమోదించి, రానున్న ఎన్నికల్లో లాభం పొందేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. బిల్లుపై ఎట్టి పరిస్థితుల్లో రాజీపడమని... బిల్లులోని అంశాలను కేవలం మాటలతో చెబితే కుదరదని, చేసి చూపాలని కోరారు.