: 20 కిలోమీటర్ల పరిధిలో నెట్ ఫ్రీ.. బీహార్లో సరికొత్త వై-ఫై జోన్

కొంతకాలం క్రితం వరకు బీహార్ అంటే బాగా వెనకబడిన రాష్ట్రాల్లో ఒకటి. కానీ, నేడు పురోగామి పథంలో దూసుకెళుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా నిలుస్తోంది. సీఎం నితీశ్ కుమార్ దార్శనికత అక్కడి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచింది. తాజాగా, రాజధాని పాట్నా నుంచి ధనపూర్ వరకు వై-ఫై జోన్ ఏర్పాటు చేశారు. తద్వారా, ఈ పరిధిలో ఉన్నవారెవరైనా ఈ జోన్ లో ఉచితంగా నెట్ సౌకర్యం అందుకోవచ్చు. మొత్తం 20 కిలోమీటర్ల పరిధి ఉన్న ఈ జోన్ ప్రపంచంలోనే అత్యంత విశాలమైన వై-ఫై జోన్. పాట్నాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం నితీశ్ ఈ నూతన వ్యవస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా నితీశ్ మాట్లాడుతూ, ఇకపై టెక్నాలజీకి పెద్దపీట వేస్తామని తెలిపారు.

More Telugu News