: ప్రతిపాదనలపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య కుదిరిన అవగాహన
రాష్ట్ర విభజన బిల్లులో సవరణల ప్రతిపాదనలపై బీజేపీ, కాంగ్రెస్ ఓ అవగాహనకు వచ్చాయి. ఈ మేరకు బీజేపీ ప్రతిపాదించిన వాటికి కాంగ్రెస్ అంగీకరించింది. సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి, పన్ను మినహాయింపు ఇచ్చేందుకు, రెండు రాష్ట్రాల్లోనూ ఆర్థిక ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు కేంద్రం ఒప్పుకుంది. భద్రాచలం మినహా మిగతా రెవిన్యూ డివిజన్ ను సీమాంధ్రకు బదలాయించేందుకు కూడా కేంద్రం ఒప్పుకుంది. ఇక బుందేల్ ఖండ్ తరహాలో ఉత్తారాంద్ర, రాయలసీమకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ, హిమాచల్ ప్రదేశ్ తరహాలో సీమాంధ్రకు పన్ను మినహాయింపునకు కేంద్రం అంగీకరించింది. వీటిపై ప్రధాని రాజ్యసభలో సభాముఖంగా ప్రకటన చేస్తారని కూడా కాంగ్రెస్ చెప్పడంతో బీజేపీ అంగీకరించింది.