: బందోబస్తుకు వస్తూ వ్యాను బోల్తా..బీఎస్ఎఫ్ జవాను మృతి

ఒడిశా జిల్లా కోరాపుట్ నుంచి విజయనగరానికి బందోబస్తు కోసం వస్తున్న బీఎస్ఎఫ్ వాహనం బొండపల్లి సమీపంలో ఓ కల్వర్టును ఢీ కొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని గజపతినగరం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన మునీందర్ కుమార్(45) అనే జవాను మృతి చెందాడు. క్షతగాత్రులను ప్రథమ చికిత్స అనంతరం విశాఖ సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించారు.

More Telugu News