: ఫేస్ బుక్ సొంతమైన వాట్స్ యాప్
మల్టీ మీడియాలో అతిపెద్ద కొనుగోలుకు తెరలేచింది. సోషల్ నెట్ వర్కింగ్ జెయింట్ ఫేస్ బుక్.. మెస్సేజింగ్ అప్లికేషన్ వాట్స్ యాప్ ను సొంతం చేసుకుంది. 1900కోట్ల డాలర్ల (రూ.1.17 లక్షల కోట్లు) భారీ మొత్తానికి వాట్స్ యాప్ ను కొనుగోలు చేయడానికి ఫేస్ బుక్ ఒప్పందం కుదుర్చుకుంది. వాట్స్ యాప్ కు 45కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. వాట్స్ యాప్ విలువ అద్భుతమని ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకెర్ బర్గ్ డీల్ అనంతరం తెలిపారు.
నెట్ సాయంతో మొబైల్ ఫోన్ల నుంచి ఉచిత మెస్సేజీలు పంపుకోవడానికి వాట్స్ యాప్ ఉపయోగపడుతోంది. ఒప్పందంలో భాగంగా 400కోట్ల డాలర్లను నగదుగా ఫేస్ బుక్ చెల్లిస్తుంది. 1200కోట్ల డాలర్ల విలువ మేరకు ఫేస్ బుక్ షేర్లను వాట్స్ యాప్ ప్రమోటర్లకు కేటాయిస్తారు. మరో 300కోట్ల డాలర్ల షేర్లను వాట్స్ యాప్ ప్రమోటర్లు, ఉద్యోగులకు తర్వాత కేటాయిస్తారు. వాట్స్ యాప్ సహ వ్యవస్థాపకుడు జాన్ కౌమ్ ఫేస్ బుక్ బోర్డులో డైరెక్టర్ గా చేరతారు.