: ప్రేమలో ఉన్నారా... అయితే, ఇలా మాట్లాడొద్దు!

ప్రేమలో ఉన్నా.. ప్రేమ ఫలించబోతున్నా.. జీవిత భాగస్వామితోనైనా సరే.. మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడాలని నిపుణులు సూచిస్తున్నారు. బరువు పెరిగావు అని మాత్రం అనకండి. అంటే అసలుకే ఎసరొస్తుందట. నిజంగా బరువు పెరిగినా సరే.. హార్మోన్లలో మార్పులా? థైరాయిడ్ గ్రంధిలో తేడాలా? ఒత్తిడిలో ఎక్కువగా తినడం వల్లా..? బరువు పెరగడానికి కారణమేంటనేది తెలుసుకునే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు. కారణం తెలుసుకోకుండా తిండి ఎక్కువగా తిన్నారని వ్యాఖ్యానించవద్దని నిపుణులు చెబుతున్నారు. చేస్తున్న తప్పులను ఎత్తిచూపకుండా వారిని అర్థం చేసుకున్న తీరులో ఓదార్పుగా చెప్పాలన్నది సూచన.

More Telugu News