: చీకటి ఒప్పందాలు చేసుకుని తెలుగు జాతిని చీల్చారు: కిరణ్

చట్ట సభల్లో ఎంపీలపై దాడులు చేయడం ఎంత వరకు సమంజసమని సీఎం కిరణ్ ప్రశ్నించారు. దొంగల్లాగ తలుపులు మూసేసి, సభ్యులను సస్పెండ్ చేసి, టెలికాస్ట్ ఆపేసి చర్చను చేపట్టడాన్ని ఖండిస్తున్నానని చెప్పారు. పార్లమెంటులో దిగజారిన పరిస్థితికి చింతిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పక్షంతో, విపక్షమైన బీజేపీ చీకటి ఒప్పందం కుదుర్చుకుని విభజనకు మద్దతు ఇవ్వడాన్ని దేశం మొత్తం గమనించిందని చెప్పారు. తెలుగు జాతినంతటినీ చీలుస్తున్న మీకు... మా బాధ కనపడటం లేదా? అని ప్రశ్నించారు. 50 ఏళ్ల పోరాటం తర్వాత, ఎంతో మంది త్యాగాల తర్వాత ఏర్పడిన రాష్ట్రాన్ని, 58 సంవత్సరాలు కలిసున్న తర్వాత విభజన చేయడం ఎంతవరకు సమంజసమని అడిగారు. పార్లమెంటులో పెట్టిన బిల్లులో తాను లేవనెత్తిన లోపాలన్నీ ఉన్నాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News