: ప్రతీ 100 మందిలో ఇద్దరు ల్యాబ్ బుజ్జాయిలే
అమెరికాలో కొత్త దంపతులు పండంటి బిడ్డ కోసం ఇప్పుడు ఐవీఎఫ్ వంటి సంతాన సాఫల్య చికిత్సలను నమ్ముకుంటున్నారు. ఇప్పుడక్కడ కళ్లు తెరుస్తున్న ప్రతీ 100 మంది శిశువులలో ఇద్దరు టెస్ట్ ట్యూబ్ బేబీలే. ఐవీఎఫ్ పద్ధతిలో వీర్యం, అండాలను సేకరించి ల్యాబులో ఫలదీకరించిన అనంతరం తీసుకెళ్లి మహిళ గర్భంలో ప్రవేశపెడతారు. 2012లో అమెరికాలో 61,740 మంది ఇలానే ఐవీఎఫ్ చికిత్స పుణ్యమా అని భూమ్మీదకు రాగలిగారు. ఇది ఆ ఏడాది అమెరికాలో జన్మించిన మొత్తం శిశువుల్లో 1.5 శాతంగా ఉంది.