: టీమిండియాపై మాజీల విమర్శల దాడి

వరుస పరాజయాలతో తల్లడిల్లుతున్న టీమిండియాపై మాజీ క్రికెటర్లు విమర్శల దాడి ఆరంభించారు. న్యూజిలాండ్ గడ్డపై వన్డే, టెస్టు సిరీస్ ల్లో ఓటమి చవిచూసిన భారత జట్టును ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని బిషన్ సింగ్ బేడి, కర్సన్ ఘావ్రి తదితరులు అభిప్రాయపడ్డారు. బిషన్ సింగ్ బేడి మాట్లాడుతూ, డబ్బుతో క్రికెటర్లను, ఓట్లను కొనవచ్చు గానీ, డబ్బుతో జట్టు ప్రదర్శనను కొనలేమని పరోక్షంగా బీసీసీఐకి చురక అంటించాడు. కెప్టెన్ ధోనీ, కోచ్ డంకన్ ఫ్లెచర్ ల పనితీరును సమీక్షించాల్సిన అవసరం ఉందని బేడి సూచించాడు. మరో మాజీ క్రికెటర్ కర్సన్ ఘావ్రి మాట్లాడుతూ, దేశవాళీ టోర్నీలకు చెత్త పిచ్ లను ఏర్పాటు చేస్తే విదేశీ సిరీస్ లలో ఫలితాలు ఇలాగే ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేశాడు. సొంతగడ్డపై రెచ్చిపోయే మన బ్యాట్స్ మెన్ విదేశీగడ్డపై తేలిపోతుంటారని ఎద్దేవా చేశాడు. బౌన్సీ వికెట్లు ఎదురైతే వారు బెంబేలెత్తిపోతుంటారని పేర్కొన్నారు.

More Telugu News