: తెలంగాణలో అంబరాన్నంటిన సంబరాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లు లోక్ సభలో ఆమోదం పొందడంతో తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ ప్రాంతంలో అన్ని పార్టీల నేతలు స్వీట్లు తినిపించి, ఆలింగనాలు చేసుకున్నారు. టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. వీధుల్లోకి వచ్చి జై తెలంగాణ నినాదాలు చేశారు.