: ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కారు: మమతా బెనర్జీ

పార్లమెంటు సంప్రదాయాలను గాలికొదిలేశారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అసలు పార్లమెంటే కాదని మమతాబెనర్జీ అన్నారు. ఈ రోజు సభ జరిగిన తీరును ఆమె తప్పుబట్టారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అన్నింటినీ తుంగలో తొక్కారని ఆమె అన్నారు. తెలంగాణ అంశం అత్యంత సున్నితమైన, గంభీరమైన అంశమని ఆమె చెప్పారు. రాజ్యసభలో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతిని కోరతామని ఆమె చెప్పారు. తెలంగాణ బిల్లుపై నిరసన తెలిపేందుకు తాము రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కోరామని మమత తెలిపారు.

More Telugu News