: రూపాయి కోసం ప్రాణం తీసిన కండక్టర్

అస్సాంలో దారుణం చోటు చేసుకుంది. చార్జీలో ఓ రూపాయి తక్కువైందని ఓ కండక్టర్ ప్రయాణికుడిని కిందికి నెట్టివేసి అతడి మరణానికి కారకుడయ్యాడు. గౌహతిలోని సిటీ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయం ఎదుటే ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో ఎక్కిన 50 ఏళ్ళ వ్యక్తి వద్ద చార్జీకి అవసరమైన డబ్బుల కంటే ఓ రూపాయి తక్కువగా ఉంది. దీంతో నజ్రుల్ హక్ (22) అనే కండక్టర్ అతడిపై ఆగ్రహించి నడుస్తున్న బస్సులోంచి కిందికి తోశాడు. రోడ్డుపై పడిపోయిన ఆ ప్రయాణికుడు అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు ఆ కోపిష్టి కండక్టర్ ను అరెస్టు చేసి బస్సును స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు.

More Telugu News