: ప్రపంచ బంగార్రాజుగా చైనా
చైనీయులు పసిడి ప్రియులుగా మారిపోయారు. ఇన్నాళ్లూ ప్రపంచంలో బంగారం వినియోగం విషయంలో భారత్ కు ఉన్న అగ్రస్థానాన్ని లాగేసుకున్నారు.ఒక్కో విభాగంలో భారత్ ను వెనక్కి తోసేస్తూ వడివడిగా బలంగా ముందుకు సాగిపోతున్న చైనా.. బంగారం వినియోగంలోనూ భారత్ ను దాటేసింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గణాంకాల ప్రకారం 2013లో చైనా ప్రపంచంలోనే అత్యధికంగా 1065టన్నులను వినియోగించి అగ్రస్థానానికి చేరుకుంది. అదే ఏడాది భారత వినియోగం 974 టన్నులుగానే ఉండడం గమనార్హం. దీనికి భారత ప్రభుత్వ ఆంక్షలే కారణమని గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. 2012లో చైనా కేవలం 806 టన్నులుగానే ఉండగా.. ఒక్క ఏడాదిలోనే 30 శాతం పెరిగి ప్రపంచ బంగార్రాజుగా అవతరించింది. 2014లోనూ ఈ పరిస్థితిలో మార్పు ఉండకపోవచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఎండీ సోమసుందరం చెప్పారు.