: పద్మశ్రీ ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు: నానా పాటేకర్
మేజర్ ధ్యాన్ చంద్ కు భారత రత్న లభించకపోవడంపై బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఒక వేళ క్రీడాకారుడికి భారతరత్న ప్రకటిస్తే.. ముందుగా ధ్యాన్ చంద్ కు మాత్రమే ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత కాలంలో ఆటగాళ్లు డబ్బు కోసమే ఆడుతున్నారని.. దేశం కోసం ఆడటం లేదని నానా ఆరోపించారు.
గుర్గావ్ సమీపంలోని కదార్ పూర్ లో ఉన్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సులో ప్రారంభమైన జీవీ మాల్వంకర్ ఓపెన్ నేషనల్ షూటింగ్ చాంపియన్ షిప్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ‘భారత రత్నకు ధ్యాన్ చంద్ అన్ని విధాలా అర్హుడు’ అని అన్నారు. ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన.. తనకు పద్మశ్రీ అవార్డు ఎందుకు ఇచ్చారో అర్థం కావడం లేదని అన్నారు. బాలీవుడ్ లో డబ్బు కోసమే పనిచేశానని నానా చెప్పారు.