: 'అవును.. వారిద్దరూ కలిసిపోతున్నారు'

కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు తొందర్లోనే కలిసిపోతాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన ఏక పక్షంగా జరుగుతోందని అన్నారు. ఇది దేశ భవిష్యత్ కు మంచిది కాదని అన్నారు. దేశంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా తనకు ఇష్టం లేని రాష్ట్రాలను ముక్కలు చేసే సంస్కృతికి కాంగ్రెస్ పార్టీ నాంది పలికిందని అన్నారు. ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీ తప్పుడు విధానాల్లో రాష్ట్రాన్ని విభజించిందని బాబు మండిపడ్డారు. సవరణలకు రాజ్యాంగ బద్దత ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.

More Telugu News