: ఎంత మంది చంద్రబాబులు వచ్చినా విభజన ఆగదు: పొన్నం ప్రభాకర్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడబోతోందని, తమ కల సాకారం కాబోతోందని తెలంగాణ నేతలు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. కాసేపటి క్రితం ఎంపీ పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లాంటి వాళ్లు ఎంతమంది వచ్చినా రాష్ట్ర విభజన ఆగదని ఈ సందర్భంగా ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ఏర్పాటు తథ్యమని చెప్పారు. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పడబోతోందని తెలిపారు.

More Telugu News