: ఆర్టికల్-3 ఉందని ఇష్టానుసారం వ్యవహరించకూడదు: చంద్రబాబు
రాజకీయ ప్రయోజనాలు ఆశించి రాష్ట్రాన్ని విభజిస్తే మరిన్న సమస్యలు ఎదురౌతాయని చెప్పినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ పెడచెవిన పెడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. అయినప్పటికీ, ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలంటూ తాము చేస్తున్న ప్రయత్నాలను ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నామని చెప్పారు. ఈ రోజు ఢిల్లీలో ఆయన మీడియతో మాట్లాడారు. ఇప్పటిదాకా జరిగాన రాష్టాల ఏర్పాటు... ఎస్సార్సీలు, కమిటీలు, కమిషన్ లు, అసెంబ్లీల ఆమోదంతోనే జరిగాయని... కానీ, తెలంగాణ ఏర్పాటు విషయంలో మాత్రం అన్ని నిబంధనలను తుంగలో తొక్కారని విమర్శించారు. కాంగ్రెస్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని విమర్శించారు. ఆర్టికల్-3 ప్రకారం అధికారం ఉంది కదా అని, ఇష్టానుసారం వ్యవహరించకూడదని హితవు పలికారు.