: రాహుల్ తో సీమాంధ్ర మంత్రుల భేటీ.. బిల్లులో మార్పులు?
ఢిల్లీలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సీమాంద్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు సమావేశమయ్యారు. ఈ భేటీలో పురందేశ్వరి, చిరంజీవి, పల్లంరాజు, కావూరి, జేడీ శీలం, కిశోర్ చంద్రదేవ్, కిల్లి, మాగుంట, బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాదును యూటీ చేయాలని వారు రాహుల్ కు విజ్ఞప్తి చేశారు. రాహుల్ తో భేటీ అనంతరం రాష్ట్ర విభజన బిల్లులో మార్పులు చేసే అవకాశముందని తెలుస్తోంది.