: స్ప్రే ఘటనపై లగడపాటికి ములాయం బాసట
పార్లమెంటులో పెప్పర్ స్ప్రే వాడిన ఘటనలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కు సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ బాసటగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్ ను విభజించేందుకు విభజన బిల్లు పెట్టిన కాంగ్రెస్ పై తన ఆగ్రహాన్ని తెలియజేసేందుకే వేరే దారిలేక రాజగోపాల్ స్ప్రే వాడారని ములాయం అన్నారు. ఈ విషయంలో ఆయనను తప్పుబట్టడం సరికాదన్నారు. ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన ములాయం, మరో గత్యంతరం లేకే ఎంపీలు పార్లమెంటులో అలా గందరగోళం సృష్టించారని చెప్పారు.