: ఏపీఎన్జీవోల ధర్నాలో ప్రసంగిస్తూ కంటతడి పెట్టిన లగడపాటి
ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ఏపీఎన్జీవోలు చేపట్టిన మహాధర్నాలో ప్రసంగిస్తూ విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మధ్యలో భావోద్వేగ్వానికి గురై కంటతడి పెట్టారు. తామిచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోలేకే తమను సభ నుంచి బయటకు పంపించారన్నారు. బిల్లు సభలో పెట్టేందుకు ఇతర రాష్ట్రాల ఎంపీలను వెల్ లోకి పంపించారన్న లగడపాటి, సభలో తాము లేకపోతే బిల్లు సజావుగా ఆమోందింపజేసుకోవచ్చనేది వారి ప్రణాళిక అని అన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఇవాళ అందరూ ఢిల్లీ వచ్చారని.. ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు, అన్ని వర్గాల వారు సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నారని అన్నారు. కాగా, ఏపీఎన్జీవోలు 20 రైళ్లు అడిగితే 7 రైళ్లే ఇచ్చారని, సమైక్యవాదులు ఎన్నో అవస్థలు పడి ఢిల్లీకి చేరుకున్నారని చెప్పారు.