: రాజ్యసభ ఛైర్మన్ ఆఫీసు వద్ద మెటల్ డిటెక్టర్ ఏర్పాటు
రాజ్యసభలో సభ్యులందరినీ తనిఖీలు చేస్తుండగా తనకు మాత్రం మినహాయింపు ఎందుకని రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ ప్రశ్నించడంతో పార్లమెంటులోని ఆయన కార్యాలయం వెలుపల ఈరోజు మెటల్ డిటెక్టర్ ను ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయం తన కార్యాలయంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా అన్సారీ ఈ వ్యాఖ్య చేశారు. దీంతో పార్లమెంటు సెక్రటరీ జనరల్ వెంటనే స్పందించి రాజ్యసభ ఛైర్మన్, ఉప ఛైర్మన్ పార్లమెంటులోకి ప్రవేశించే గేట్ నెంబర్ 11 వద్ద ఒక మెటల్ డిటెక్టర్ ను ఏర్పాటు చేయాల్సిందిగా భద్రతా విభాగాన్ని ఆదేశించారు.
లోక్ సభలో గతవారం కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రేతో దాడి చేసిన తరువాత పార్లమెంటు భవనంలో భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు నియమించిన కమిటీ సమావేశం కావడానికి కొద్ది గంటల ముందు ఈ ఘటన చోటు చేసుకుంది.