: ఔను.. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు!

మూడు పదుల వయస్సు దాటినా వారి ఎత్తు మూడున్నర అడుగులు దాటలేదు. కానీ, వారిద్దరూ కలిసి ఏడడుగులు వేసి ఒక్కటయ్యారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురానికి చెందిన శ్రీనివాసరాజు (33) వ్యవసాయ పనులు చేస్తుంటాడు. రాజు మూడున్నర అడుగుల ఎత్తు మాత్రమే ఎదిగిన అతడు తనకిక పిల్ల దొరకదని బెంగ పెట్టుకున్నాడు. సరిగ్గా, ఆ సమయంలోనే అతడికి.. అంతే ఎత్తు ఉన్న వాడపల్లికి చెందిన కొండా రత్నం (30) కనపడింది.

ఇంకేముంది.. వారిద్దరి బతుకుల్లో వసంతం వెలుగుచూసింది. కులాలు వేరైనా వాళ్లిద్దరి మనసులు కలిశాయి. ఇరువైపుల పెద్దలూ వారి అభీష్టాన్ని మన్నించి వాడపల్లి వెంకటేశ్వరాలయంలో వివాహం జరిపించారు. వారిద్దరూ కొంగుముడి వేసుకుని, ఏడడుగులు నడుస్తుంటే.. బంధు మిత్రులు ఆనందంతో అక్షింతలు వేసి ఆశీర్వదించారు.

More Telugu News