: కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్..
అండర్-19 ప్రపంచకప్ లో నేడు రెండో లీగ్ మ్యాచ్ ఆడుతున్న యువ భారత్.. తొలుత ఫీల్డింగ్ చేసి స్కాట్లాండ్ ను 88 పరుగులకే ఆలౌట్ చేసింది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ నమోదు చేశాడు. కుల్దీప్ మొత్తం నాలుగు వికెట్లు తీయగా, మరో బౌలర్ అమీర్ ఘని కూడా నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. ఈ టోర్నీలో తొలి హ్యాట్రిక్ కుల్దీప్ దే. ఇక, లక్ష్యఛేదనలో భారత్ కుర్రాళ్ళు తడబడ్డారు. 3.4 ఓవర్లలో 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడ్డారు. ఓపెనర్ బైన్స్ (3 బ్యాటింగ్), శాంసన్ (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.