: బద్ధకం వదిలించే మాత్ర త్వరలో!

ఎందుకలా..? కొందరు ఎక్కడివేసిన గొంగళి అక్కడే అన్నట్లు బద్దకస్తుల్లా ఉంటే.. మరికొందరు సుడిగాలిలా అంత చలాకీగా, చురుగ్గా ఎలా ఉంటున్నారు? ఎక్కడ ఈ తేడా? శాస్త్రవేత్తలు కనిపెట్టేశారు. వ్యక్తులు బద్దకస్తుల్లా మారిపోవడానికి కారణమయ్యే జన్యువును వారు కనిపెట్టేశారు. దీనికి కౌంటర్ వేయగలిగే ఔషధాన్ని కనుగొంటే.. ఇక అందరి బద్దకాన్ని వదిలించి ఉరుకులు పెట్టించొచ్చు. వ్యక్తులను బద్దకస్తుల్లా మార్చే మెదుడులోని కోచ్ పొటాటో అనే జన్యువును అబెర్డీన్ యూనివర్సిటీ, చైనీస్ సైన్స్ అకాడమీ పరిశోధకులు కనిపెట్టేశారు. ఈ జన్యువు మెదడులోని డొపమైన్ పై చాలా ప్రభావం చూపుతున్నట్లు పరిశోధనలో తేలింది. డొపమైన్ మన ప్రవర్తనతోపాటు ఎన్నో చర్యలను నిర్దేశిస్తుంది. దీంతో ఈ జన్యువుకు ముకుతాడు వేసే ఔషధం తీసుకురాగలమనే ఆశాభావంతో వారున్నారు.

More Telugu News